సిటీలో దంచికొడుతున్న వాన..రోడ్లన్నీ జలమయం

సిటీలో దంచికొడుతున్న వాన..రోడ్లన్నీ జలమయం

హైదరాబాద్ సిటీలో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడి.. ఒక్కసారిగా వర్షం దంచికొడుతోంది. కుండపోత వర్షంతో జనాలు అవస్థలు పడుతున్నారు. లక్డీకాపూల్, నాంపల్లి, అబిడ్స్, మాసబ్ ట్యాంక్, హిమాయత్ నగర్ లో వర్షం పడుతోంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో జోరు వాన కురుస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం పడుతుండటంతో.. సిటీ జనం ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండటంతో రోడ్లపై అవస్థలు పడుతున్నారు జనం. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. అటు జిల్లాలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.