
నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల మున్నార్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్.. తాజాగా హైదరాబాద్‌లో యాక్షన్ షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ డిజైన్ చేసినట్టు తెలియజేశారు.
స్పెషల్ కేర్‌తో ఈ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో నితిన్ సరికొత్త పాత్రలో ట్రెండీ లుక్‌లో కనిపించనున్నాడు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ‘భీష్మ’ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.