జై హనుమాన్లో కేజీఎఫ్ స్టార్.. అంచనాలు పెంచుతున్న క్రేజీ న్యూస్

జై హనుమాన్లో కేజీఎఫ్ స్టార్.. అంచనాలు పెంచుతున్న క్రేజీ న్యూస్

జై హనుమాన్(Jai Hanuman).. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ చూపులన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. హనుమాన్(HanuMan) సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తెరెకక్కించిన ఈ సినిమాటిక్ బ్రిలియన్స్ కు ఇండియన్ ఆడియన్స్ తో పాటు ఓవర్ సీస్ ఆడియన్స్ సైతం నోరెళ్లబెట్టారు. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో ఆ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ను క్రియేట్ చేసి సినీ దిగ్గజాలతో సైతం శభాష్ అనిపించుకున్నాడు ప్రశాంత్. 

సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక హనుమాన్ సినిమా చివర్లో సీక్వెల్ గా జై హనుమాన్ ను ప్రకటించి ఆడియన్స్ అదిరిపోయే షాకిచ్చాడు ప్రశాంత్ వర్మ. ఇక అప్పటి నుండి జై హనుమన్ సినిమా రోజుకో న్యూస్ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా ఒక స్టార్ హీరో కనిపిస్తారని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఆ స్టార్ హీరో ఎవరో కాదట. కన్నడ స్టార్ హీరో యష్ అని తెలుస్తోంది. అవును జై హనుమాన్ హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా కనిపించేది రాకింగ్ స్టార్ యష్ అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ భారీ సక్సెస్ తరువాత.. యష్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. అందుకే ఈ సినిమా కోసం యష్ ను తీసుకోనున్నాడట ప్రశాంత్ వర్మ. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ వార్త గనక నిజమైతే.. జై హనుమాన్ భారీ విజయం సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.