Indian Police Force : ఇండియా టాప్ ట్రెండింగ్ సిరీస్లో..ఇండియన్ పోలీస్ ఫోర్స్..

Indian Police Force : ఇండియా టాప్ ట్రెండింగ్ సిరీస్లో..ఇండియన్ పోలీస్ ఫోర్స్..

యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్..బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి(Rohit Shetty) మరియు సుశ్వాంత్ ప్రకాశ్ డైరెక్షన్లో తెరెకెక్కిన వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1(Indian Police Force). సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి పోలీస్ ఆఫీసర్స్గా నటించిన ఈ వెబ్ సిరీస్ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు ఉర్దూ సహా మరిన్ని భాషల్లోనూ ఈ సిరీస్ జనవరి19 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది.

ప్రస్తుతం ఈ సిరీస్‍కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పోలీస్ యాక్షన్ థ్రిల్లర్తో వచ్చిన ఈ సిరీస్..భారత్‍తో పాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, యూఏఈ అండ్ సింగపూర్ వంటి దేశాల్లో..టాప్-10 మూవీస్లో ట్రెండ్ అవుతోందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. 

యాక్షన్ లవర్స్కే కాకుండా..ప్రతి ఒక్కరినీ ఈ సీరీస్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇండియాలో టాప్‍ మూవీస్ లలో ఈ వెబ్ సిరీస్ ట్రెండ్ అవుతోంది. వరుస బాంబు పేలుళ్లతో భారత రాజధాని ఢిల్లీని వణికిస్తున్న..ఓ టెర్రర్ గ్రూపును పట్టుకునే పనిలో భాగంగా పోలీస్ ఫోర్స్ చేసిన సాహసాలు..వారు వేసే లాజిక్స్ ఈ సీరీస్లో స్పెషల్ హైలెట్స్గా నిలిచాయి. ఇంటెన్స్‌ పెంచే ఈ వెబ్ సీరీస్ డ్రామాలో సిద్ధార్థ్, శిల్పాశెట్టి నటన ఆడియన్స్ను సీజన్ 2 పై ఉత్కంఠ కలిగేలా చేసింది.ఈ సీరీస్ చూసిన ఆడియన్స్ సెల్యూట్ రియల్ సోల్జర్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్‌ను రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఇషా తల్వార్, విభూతి ఠాకూర్, కరణ్‌వీర్ మల్హోత్రా, నికితిన్ ధీర్, శ్వేతా తివారీ, శరద్ కేల్కర్, ముఖేష్ రిషి, మృణాల్ కులకర్ణి, మయ్యంక్ టాండన్, రీతూ రాజ్ సింగ్ త‌దిత‌రులు ఈ సిరీస్‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.