ఫిఫా వరల్డ్ కప్ 2026లో స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ పోరాటం ముగిసింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా మంగళవారం (జులై 7) జరిగిన ఉత్కంఠ పోరులో పోర్చుగల్‌పై 1-0 తేడాతో స్పెయిన్ విజయం సాధించింది. ఈ ఓటమితో పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పోర్చుగల్‌కు ఫిఫా వరల్డ్ కప్ అందించాలన్న తన కల నెరవేరకపోవడంతో మ్యాచ్ అనంతరం రొనాల్డో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఓటమితో ఫిఫా వరల్డ్ కప్ నుంచి వైదొలగడం విచారంగా ఉంది. పోర్చుగల్‌కు కప్ అందించేందుకు నా సర్వశక్తులు ఒడ్డి పోరాడాను. ఇప్పుడు నిర్మలమైన మనసుతో నిష్క్రమిస్తున్నాను. ఇదే నా చివరి ప్రపంచ కప్ అన్నది వాస్తవమే. కానీ ఇప్పుడు నాకు జరిగిన దాని గురించి ఆలోచించుకోవడానికి నా కుటుంబంతో గడపడానికి సమయం ఉంటుంది. ఇకపై నేను ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోను’’ అని అన్నాడు.
2016 యూరోపియన్ ఛాంపియన్‌షిప్, 2019, 2025లో యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్‌లు గెలవడంలో పోర్చుగల్‌కు సహయపడ్డానని గుర్తు చేశాడు. నేను రాకముందు పోర్చుగల్ ఒక్క మేజర్ టైటిల్ కూడా గెలవలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోర్చుగల్ ఇప్పటివరకు గెలిచిన అతిపెద్ద టైటిల్ 2016 యూరోపియన్ ఛాంపియన్‌షిప్ అని పేర్కొన్నారు. నిజంగా చెప్పాలంటే నాకు ప్రపంచ కప్‌తో సమానమని రోనాల్డో స్పష్టం చేశాడు.
