రోజ్​ ఛాయ్​.. రోజూ తాగెయ్​

రోజ్​ ఛాయ్​.. రోజూ తాగెయ్​

యాక్టివ్​గా, హెల్దీగా ఉండాలంటే ఛాయ్‌ తాగాల్సిందే అనుకుంటారు చాలామంది. ఛాయ్‌లలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ‘రోజ్​ టీ’ ఒకటి.  టేస్టీగా ఉండే ఈ టీ హెల్త్​కు ఎంతో మంచిది. ఈ రోజ్​ టీ లో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో యాంటీబాడీస్​ను పెంచుతుంది.  పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు  అవసరమయ్యే పోషకాలన్నీ రోజ్​ ఛాయ్‌లో ఉన్నాయని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. ముఖ్యంగా రోజ్​ టీ బరువు తగ్గించడంలో బాగా పని చేస్తుంది. వెయిట్​ తగ్గాలనుకునేవాళ్లు రకరకాల డైట్స్​ ఫాలో అవుతుంటారు. వాటితో పాటు రోజ్​ ఛాయ్‌ని తాగితే సులువుగా బరువు తగ్గొచ్చని అంటున్నారు డాక్టర్లు. ఈ ఛాయ్‌ని రోజూ తాగడం వల్ల చర్మం  మెరుస్తుంది.  జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.  రోజ్ టీ  జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. 
  స్ట్రెస్ బస్టర్‌‌గా  పనిచేసి.. మానసిక ప్రశాంతతను ఇస్తుంది.  శరీరంలోని టాక్సిన్స్​ను తొలగిస్తుంది. 
కావాల్సినవి... 
ఏడు నుంచి పది గులాబీ రేకలు, కప్పు  నీళ్లు, తేనె, నిమ్మరసం.

తయారీ
తాజా  గులాబీ పూరేకలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో నీళ్లు వేడిచేయాలి. ఆ వేడి నీళ్లలో  గులాబీ రేకలను వేసి పది నిమిషాలు మరిగించాలి.  తర్వాత ఈ నీళ్లని ఒక కప్పులో వడకట్టాలి. అందులో  తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి.