ప్రేమించడంలేదని యువతిపై దాడి.. అమ్మమ్మకు కత్తి పోట్లు

ప్రేమించడంలేదని యువతిపై దాడి.. అమ్మమ్మకు కత్తి పోట్లు

ఖమ్మం : ప్రేమ పేరుతో రోజూ వెంటపడి వేధిస్తున్నా.. యువతి పట్టించుకోకపోవడంతో ఖమ్మంలో ఓ రౌడీషీటర్ రెచ్చిపోయాడు. న్యూఇయర్ వేడుకల వేళ ఆమెను కత్తితో చంపడానికి యత్నించాడు ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి. ఈ ఘటనలో యువతి తప్పించుకోగా.. అడ్డుకోబోయిన ఆమె అమ్మమ్మను పొడిచాడు.

స్థానికులు అడ్డుకోవడంతో వారిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి పరార్ అయ్యాడు. నిందితుడు ప్రేమ్ కుమార్  కూడా తన చెవికోసుకుని ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన ఖమ్మం నగరంలో మంగళవారం రాత్రి జరగ్గా.. ఆలస్యంగా బయటపడింది.