RCB vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు (2026, ఏప్రిల్ 24న) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిస్తే బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంది. సొంత మైదానంలో ఆడుతుండటం వారికి కలిసొచ్చే అంశం. ఇక గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో 99 పరుగుల తేడాతో ఓడిపోయి, ప్రస్తుతం ఒత్తిడిలో ఉంది. వారి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టాప్ ఆర్డర్ రాణిస్తేనే ఆ జట్టు కోలుకోగలదు.
పిచ్ రిపోర్ట్:
చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామం.. ఇక్కడి బౌండరీలు చిన్నవిగా ఉండటం వల్ల సిక్సర్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది. బౌలర్లకు ఇక్కడ పెద్దగా సహకారం ఉండదు, కాబట్టి ఇదొక హై-స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డులు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు జరిగాయి. ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డు3 –3తో సమవుజ్జీలుగా ఉన్నాయి. ఏ జట్టు కూడా మరొకరిపై స్పష్టమైన ఆధిపత్యాన్ని నెలకొల్పలేకపోయింది. కావునా, ఈరోజు జరిగే పోరులో RCB ఆధిపత్యం ప్రదర్శిస్తుందా, గుజరాత్ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందో చూద్దాం..
►ALSO READ | ఐపీఎల్ చరిత్రలోనే MIకి బిగ్గెస్ట్ షాక్.. ఒక్క మ్యాచ్ తో చెన్నై బద్దలు కొట్టిన రికార్డులు..
తుది జట్ల అంచనా:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారూఖ్ ఖాన్, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ.

