RRRలో చరణ్ లుక్ : ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వరుణ్

RRRలో చరణ్ లుక్ : ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వరుణ్

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మెగా ప్రాజెక్ట్ RRR. ఈ మూవీ ప్రారంభం నుంచే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు మొదలయ్యాయి. పూణేలో భారీ షెడ్యూల్ జ‌రిపేందుకు సినిమా యూనిట్ సిద్ద‌మైంది. ఇప్ప‌టికే టీం అంతా షూటింగ్‌ లో పాల్గొనేందుకు పూణే వెళ్ళ‌గా..  47 రోజుల పాటు అక్క‌డ షూటింగ్ జ‌ర‌ప‌నున్నార‌ట‌. ఈ షెడ్యూల్‌ లో రామ్ చ‌ర‌ణ్ , ఎన్టీఆర్‌ ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్ , విదేశీ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌, స‌ముద్ర‌ఖ‌ని పాల్గొంటార‌ని చెబుతున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్,  కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారని ఇటీవ‌ల జ‌రిగిన మీడియా స‌మావేశంలో ప్రకటించాడు రాజమౌళి.

ప్రెస్‌ మీట్‌ కి హాజ‌రైన స‌మయంలో చ‌ర‌ణ్‌, తార‌క్‌లు ఇద్ద‌రు క్యాప్‌ లు పెట్టుకొని త‌మ పూర్తి లుక్ రివీల్ కాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ న‌టిస్తాడు అనే స‌రికి ఆయ‌న లుక్ ఎలా ఉంటుంద‌నే దానిపై అభిమానులు ఊహ‌ల‌లో మునిగి తేలుతున్నారు. అయితే.. మెగా ఫ్యాన్స్ కోసం వ‌రుణ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్‌లో చెర్రీతో దిగిన ఓ ఫోటోని బ్ర‌ద‌ర్ ల‌వ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేశాడు. ఇందులో చ‌ర‌ణ్ లుక్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది.  400 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్న ఈ బిగ్ మల్టీస్టారర్ 2020 జూలై 30న రిలీజ్ కానుంది.