మూడు రోజుల్లో రూ.25 కోట్ల మందు తాగారు : జస్ట్ ఈ ఒక్క జిల్లాలోనే..

మూడు రోజుల్లో రూ.25 కోట్ల మందు తాగారు : జస్ట్ ఈ ఒక్క జిల్లాలోనే..

దసరా వచ్చింది.. సందడి తెచ్చింది.. ఎవరికి అంటే లిక్కర్ షాపులకు.. అవును.. తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మద్యం అమ్మకాలు కెవ్వు కేక పుట్టించాయి. అవును.. జనం దసరా సరదా సరదాగా ఎంజాయ్ చేసేశారు. మందు కొట్టారు.. అలా ఇలా కాదు.. బీభత్సంగా మందు పార్టీలతో సర్కార్ ఆదాయం పెంచేశారు. 

ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో 2026, అక్టోబర్ 16, 17, 18 తేదీల్లో మద్యం అమ్మకాలు ఏకంగా 25 కోట్ల రూపాయలకు చేరాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 151 వైన్ షాపులు, 30 బార్లు ఉండగా.. అమ్మకాలు 25 కోట్ల రూపాయలుగా ఉంది. మూడు రోజుల్లోనే 16 వేల కేసుల మద్యం, 50 వేల కేసుల బీర్లు తాగేశారు మందు ప్రియులు. ఈ మందు అంతా మాక్లూర్ ఐఎంఎల్ డిపో నుంచి సరఫరా అయ్యింది. 

18, 19, 20 తేదీలను కూడా కలుపుకుంటే మద్యం అమ్మకాలు 35 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. 21వ తేదీ బుధవారం సైతం 6 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు, వ్యాపారులు. గత సంవత్సరం దసరా పండుగ పర్వదినాల్లో 19 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని.. ఈ ఏడాది రెట్టింపు ఉండొచ్చని అధికారులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే 2026 సంవత్సరం దసరా పండగ రోజుల్లో మద్యం అమ్మకాల్లో భారీగా పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలోనే దసరా లిక్కర్ కిక్కు.. రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టింది.