క్వారీల లీజుదారులకు రూ.6.16 కోట్ల ఫైన్

క్వారీల లీజుదారులకు రూ.6.16 కోట్ల ఫైన్

 కరీంనగర్, వెలుగు: కరీంనగర్​జిల్లాలోని గ్రానైట్, కంకర, మట్టి, ఇసుక క్వారీలపై మైనింగ్ ఆఫీసర్లు కొరడా ఝలిపించారు. వారం రోజులుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. హద్దులను అతిక్రమించి తవ్వకాలు జరిపిన లీజుదారులకు భారీ మొత్తంలో ఫైన్ వేశారు. ఇప్పటివరకు నాలుగు క్వారీల లీజుదారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు కేసులు నమోదు చేయడంతోపాటు రూ.6కోట్ల11లక్షల84వేల400 జరిమానా విధించారు. అలాగే గ్రానైట్, ఇసుక ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ ను తనిఖీ చేసి, ఆరు వెహికల్స్​పై కేసు నమోదు చేశారు. రూ.5లక్షల12వేల128 ఫైన్ వేశారు. మొత్తం రూ.6కోట్ల16లక్షల96వేల528- ఫైన్ వేసినట్లు మైనింగ్ ఏడీ వెల్లడించారు. అలాట్ విస్తీర్ణం, హద్దులకు లోబడే మైనింగ్ చేయాలని సూచించారు. ఖనిజ రవాణా చేసే ప్రతి వెహికిల్ ‘వే బిల్లు’ కలిగి ఉండాలన్నారు.