ఆర్టీసీ సిబ్బందిపై  దాడి చేస్తే జైలుకే: ఎండీ నాగిరెడ్డి

ఆర్టీసీ సిబ్బందిపై  దాడి చేస్తే జైలుకే: ఎండీ నాగిరెడ్డి

హైదరాబాద్, వెలుగు :   ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఇక వారు జైలుకేనని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల టోలిచౌకి పోలీస్టేషన్ పరిధిలోని గెలాక్సీ బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఆజమ్, లక్ష్మయ్య పై జీషాన్ అనే వ్యక్తి అకారణంగా దాడిచేస్తే అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆర్టీసీ ఆస్తులకు నష్టం కలిగిస్తే.. ప్రజా ఆస్తుల ధ్వంసం నిరోధక చట్టం కింద కేసులు పెడ్తామని ఎండీ స్పష్టం చేశారు.