నైంటీస్‌లో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న జేడీ చక్రవర్తి.. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాడు. తాజాగా తనొక క్రేజీ ప్రాజెక్టులో జాయిన్ అయ్యాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కల్కి2’లో జేడీ కూడా భాగమయ్యాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడని, రీసెంట్‌గా షూటింగ్ సెట్స్‌లో కూడా పాల్గొన్నాడని ప్రచారం జరుగుతోంది.
కానీ తన ఎంట్రీ గురించి మూవీ టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అలాగే హీరోయిన్ విషయంలోనూ క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రం నుంచి దీపికా పదుకొణెను తప్పించిన టీమ్.. ఆమె ప్లేస్‌లో ఎవరు నటిస్తారనేది ఇంకా రివీల్ చేయలేదు.
మరోవైపు ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించగా, ప్రస్తుతం కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
