అనిరుధ్-కావ్య పెళ్లికి కోహ్లీకి ఇన్విటేషన్..? సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ

అనిరుధ్-కావ్య పెళ్లికి కోహ్లీకి ఇన్విటేషన్..? సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. 2026 నవంబర్‎లో ఈ జోడీ పెళ్లి చేసుకోబోతున్నారు. కావ్య మారన్ ఫ్యామిలీ ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు షురూ చేసింది. ఇందులో భాగంగానే పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్త తెగా వైరల్ అవుతోంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కావ్య-అనిరుధ్‎ల వివాహానికి ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

కోహ్లీతో పాటు ఎమ్మెస్ ధోనీ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఆహ్వానితుల జాబితాలో కోహ్లీ పేరు ఉన్నదా లేదా అనే విషయంపై మారన్ కుటుంబం నుండి గానీ, కోహ్లీ తరపున గానీ ఎటువంటి స్పష్టత రాలేదు. అనిరుధ్‎తో పరిచయం కారణంగా ధోనీ వీరి పెళ్లి లేదా రెసెప్షన్‎కు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

కావ్య, అనిరుధ్‎ల పెళ్లికి కోహ్లీని ఇన్వైట్ చేశారన్న ప్రచారంపై నెటిజన్లు, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరికీ నచ్చినట్లుగా వారు స్పందిస్తున్నారు. ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి వెళ్లలే.. మీరెంతా అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 2016లో ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ దూరం చేసిన ఎస్ఆర్‎హెచ్ ఓనర్ కావ్య పెళ్లికి వెళ్లొద్దని కింగ్ అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రచారం నిజమై కావ్య-అనిరుధ్‎ల వివాహ వేడుకకు హాజరైతే మాత్రం కోహ్లీని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. 

నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్

అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. 2026 నవంబర్లో ఈ లవ్ బర్డ్స్ వివాహబంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. నవంబర్ 10, 11వ తేదీల్లో పెళ్లి విదేశాల్లో జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతానికి పెళ్లి తేదీని అఫిషియల్‎గా అనౌన్స్ చేయనప్పటికీ రిసెప్షన్ డేట్ మాత్రం రివీల్ అయ్యింది.

నవంబర్ 21న చెన్నెలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‎లో కావ్య, అనిరుధ్ ల రిసెప్షన్ వేడుక గ్రాండ్‎గా జరగనుంది. ఈ క్రమంలోనే తమ కుమార్తె రిసెప్షన్ వేడుకకు హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులకు  కావ్య మారన్ పేరెంట్స్, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు ఆహ్వానం అందజేశారు. దీంతో కావ్య, అనిరుధ్‏ల పెళ్లి మ్యాటర్ అఫిషియల్‎గా కన్ఫామ్ అయ్యింది. 

ప్రచారానికి ఎండ్ కార్డ్

కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపికే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, పెళ్లి వార్తలను కావ్య మారన్ గానీ అనిరుధ్ గానీ ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. దీంతో వీరి పెళ్లి టాపిక్‎పై సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ తరుణంలో కావ్య పేరెంట్స్ పలువురికి వివాహ ఆహ్వాన పత్రికలు అందజేయడంతో కావ్య, అనిరుధ్‎ల పెళ్లిపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కావ్య, అనిరుధ్ కు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వై దిస్ కొలవెరి డీ సాంగ్ తో పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్.. అనంతరం తమిళ, హిందీ సినిమాల్లో అనేక హిట్ పాటలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జైలర్, జెర్సీ, జవాన్, లియో లాంటి పలు చిత్రాలకు ఆయన అందించిన సంగీతం చాలా మంచి ఆదరణ పొందింది. కళానిధి మారన్ నిర్మించిన జైలర్, బీస్ట్, రాయన్ వంటి సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు. కావ్య.. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె.. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్. ఐపీఎల్ సమయంలో గ్రౌండ్‎లో తనదైన స్టైల్‎లో హావభావాలతో పాపులర్ అయింది. సన్ రైజర్స్ అభిమానులు కావ్యను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు.