100 మీటర్ల దూరంలో ఫినిష్ లైన్.. మారథాన్ లో యువకుడు కార్డియాక్ అరెస్ట్ తో మృతి

100 మీటర్ల దూరంలో ఫినిష్ లైన్.. మారథాన్ లో యువకుడు కార్డియాక్ అరెస్ట్ తో మృతి

మారథాన్ కొనసాగుతోంది.. వందలమంది మారథాన్ లో పాల్గొన్నారు.. మరో 100 మీటర్లు పోతే ఫినిష్ లైన్.. ఇంతలోనే అనుకోని సంఘటన..రన్నింగ్ చేస్తూనే యువకుడు కుప్పకూలాడు.. పక్కనే పరుగెతున్న డాక్టర్ సీపీఆర్ చేశారు. అయిన ఫలితం లేదు..మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన మారథాన్ లో పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ యువకుడు కార్డియాక్ అరెస్ట్ తో మృతిచెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఇటీవల సంభవిస్తున్న మరణాలకు ఓ ప్రధాన కారణంగా కనిపిస్తున్న కార్డియాక్ అరెస్ట్ మరోసారి చర్చనీయాంశమైంది. 

ఆదివారం (ఫిబ్రవరి7)  మధ్యప్రదేశ్ లోని ఇండోర్  జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో మారథాన్ నిర్వహించారు. ఇండోర్ లో ఉంటున్న కోలకతాకు చెందిన ఆర్యన్ తోడే అనే యువకుడు మారథాన్ లో పరుగెడుతూ ఫినిష్ లైన్ మరో 100 మీటర్ల దూరంలో అకస్మాత్తుగా కుప్పకూలాడు. మారథాన్ లో పాల్గొన్న ఓ డాక్టర్ల అతనికి సీపీఆర్ చేశారు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.. అయితే ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు..ఆర్యన్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.  

ఆర్యాన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ సంఘటనతో ఇటీవల వరుసగా సంభవిస్తున్న కార్డియాక్ అరెస్ట్ మరణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆడుతూ ఒకరు.. తింటూ మరొకరు.. స్నానం చేస్తూ ఇంకొకరు.. డ్రైవ్ చేస్తూ ..టీ తాగుతూ.. మాట్లాడుతూ.. ఇలా అనేక సందర్భాల్లో కార్డియాక్ అరెస్టులతో ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. కరోనా తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువకావడం.. కార్డియాక్ అరెస్టు అంటే ఏమిటీ..ఆకస్మిక మరణాలకు ఎలా కారణం అవుతుంది. ఇది గుండెపోటేనా.. దానికి భిన్నమైనదా అనే రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి.

కార్డియాక్ అరెస్టు అంటే?

అమెరికన్ హార్ట్ అసోసియేషన్(heart.org) అందిస్తున్న రిపోర్టుల ప్రకారం.. కార్డియాక్ అరెస్ట్ అనేది ఆకస్మికంగా సంభవిస్తుంది. దానికి ముందస్తు లక్షణాలంటూ ఏమీ ఉండవు. గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడి కారణంగా ఇది సంభవిస్తుందట. ఈ అలజడి ఫలితంగా గుండె కొట్టుకోవడంలో ఇంబ్యాలెన్స్ ఏర్పడి రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యంపై ప్రభావం పడి మరణాలకు దారి తీస్తుంది. దీంతో మెదడు,గుండె, ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా ఆటంకం ఏర్పడుతుంది. దీంతో రోగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లడం, నాడి కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. సరియైన సమయంలో సరియైన చికిత్స అందకపోతే పేషెంట్ కొద్ది నిమిషాల్లోనే మరణిస్తారని  హార్ట్ ఓఆర్ జీ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. 

కార్డియాక్ అరెస్ట్ నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా?

కార్డియాక్ అరెస్ట్ బారిన పడ్డప్పుడు డిఫిబ్రిలేటర్ పరికరంతో సాయంతో విద్యుత్ షాక్ ఇవ్వడం,   అది లేకపోతే సకాలంలో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చంటున్నారు డాక్టర్లు.  రెండు చేతులు తిన్నగా పెట్టి రోగి ఛాతిపై బాగా నొక్కాలి. నోటిలో నోరు పెట్టి గాలిని కూడా ఉదాలి.. ఇలా చేసినట్లయితే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు.