పుతిన్ తలపై రివార్డు ప్రకటించిన రష్యా బిజినెస్ మ్యాన్

పుతిన్ తలపై రివార్డు ప్రకటించిన రష్యా బిజినెస్ మ్యాన్
  • పట్టిచ్చినా.. ప్రాణం తీసినా 76 కోట్లిస్త
  • పుతిన్ తలపై రివార్డు ప్రకటించిన రష్యా బిజినెస్ మ్యాన్

న్యూయార్క్: రష్యా ప్రెసిడెంట్​ పుతిన్​ను అరెస్ట్ చేసినా.. ఆయన ప్రాణం తీసినా రూ.76 కోట్లు రివార్డు ఇస్తానని రష్యాకు చెందిన బిజినెస్​మ్యాన్ కొనానిఖిన్ ప్రకటించాడు. ‘‘రష్యా, ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం పుతిన్​ను యుద్ధ నేరస్థుడిగా గుర్తించి అరెస్ట్ చేసిన అధికారులకు రూ.76 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నా”అని గురువారం ఫేస్​బుక్​లో పోస్ట్ చేశాడు. కొనానిఖిన్ రష్యాను వదిలిపెట్టి అమెరికాలో ఆశ్రయం పొందుతున్నాడు. పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడ్డాడు కాబట్టి ఆయనను కోర్టుకు తీసుకురావాలని రష్యా సైనిక అధికారులను కోరాడు. రష్యాలో ఎన్నికలను తొలగించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడని, తనకు తానే జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడని మండిపడ్డారు. ఇపుడు కారణం లేకుండా ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించి అనేక మంది చావులకు కారణమవుతున్నాడని ఆరోపించారు. రష్యా సిటిజన్​గా దేశాన్ని పుతిన్ లాంటివాళ్ల నుంచి కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. కొనానిఖిన్ చేసిన ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. ఆపై తాను చేసిన ఈ పోస్ట్​ను ఫేస్​బుక్ మేనేజ్​మెంట్ డిలీట్ చేసిందని కొనానిఖిన్ వెల్లడించారు.