IND vs AFG: హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి తప్పుకోవడం టీమిండియాకి పెద్ద సెట్‌బ్యాక్ అనే చెప్పాలి.. జూన్ 13 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపించనుంది. కింగ్ కోహ్లీ ప్లేస్‌ను రీప్లేస్ చేయడానికి BCCI దగ్గర ముగ్గురు ఐపీఎల్ స్టార్స్ గట్టిగా పోటీ పడుతున్నారు.
* రుతురాజ్ గైక్వాడ్:
కింగ్ విరాట్ కోహ్లీ ప్లేస్‌కి ఫస్ట్ ఛాయిస్ కచ్చితంగా సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అనే చెప్పాలి.. ఈ ఏడాది ఐపీఎల్‌లో రుతురాజ్ పర్ఫార్మెన్స్ కాస్త యావరేజ్‌గా ఉన్నా.. వన్డేల్లో అతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. తను ఆడిన లాస్ట్ వన్డే మ్యాచ్‌లో రుతురాజ్ నంబర్ 4 పొజిషన్‌లో వచ్చి అదిరిపోయే సెంచరీ కొట్టాడు. అప్పట్లో కోహ్లీతో కలిసి సాలిడ్ పార్టనర్‌షిప్ కూడా బిల్డ్ చేశాడు. ఇన్నింగ్స్‌ను యాంకర్ చేస్తూ ఏ పొజిషన్‌లోనైనా బ్యాటింగ్ చేయగల కెపాసిటీ రుతురాజ్ సొంతం.
* రజత్ పటిదార్:
ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ కూడా విరాట్ కోహ్లీ రీప్లేస్‌మెంట్ రేసులో ఉన్నాడు. పటిదార్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో కేవలం ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. కానీ, ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున అతను చూపిస్తున్న కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ వల్ల సెలెక్టర్లు అతని పేరును ఖచ్చితంగా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్‌ను అద్భుతంగా ఆడటం ఇతని ప్లస్ పాయింట్.
* దేవదత్ పడిక్కల్:
రజత్ పటిదార్ ఆర్‌సీబీ టీమ్‌మేట్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదూత్ పడిక్కల్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాడు. దేశీవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ రీసెంట్‌గా పరుగుల వరద పారించాడు. టీమ్‌లో ఒక లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కావాలనుకుంటే మాత్రం పడిక్కల్‌కి లాటరీ తగిలే ఛాన్స్ ఉంది.
ఆఫ్ఘన్ సిరీస్ షెడ్యూల్:
న్యూ చండీగఢ్‌లో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. జూన్ 13 నుంచి భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. కాగా విరాట్ కోహ్లీ ప్లేస్‌ను రీప్లేస్ చేయడం ఎవరికైనా కత్తి మీద సామే.. మరి అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ ద్వయం ఈ ముగ్గురిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది జూన్ 13వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.
