ధనస్సు రాశి వారికి 2026 సెప్టెంబరు నెలలో లాభ స్థానంలో బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ నెలలో కొన్ని ముఖ్యమైన విజయాలు, సాఫల్యాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో కొన్ని కీలక గ్రహాలు మారడం వలన చాలా అనుకూలంగా, లాభదాయకంగా ఉంటుంది.
సెప్టెంబర్ లో స్థానాలు మారుతున్న గ్రహాలు
- సెప్టెంబర్ 2: తులా రాశిలోకి శుక్రుడు
- సెప్టెంబర్ 7: కన్యారాశిలోకి బుధుడు
- సెప్టెంబర్ 17: కన్యారాశిలోకి సూర్యుడు
- సెప్టెంబర్ 18: కర్కాటక రాశిలోకి కుజుడు
- సెప్టెంబర్ 26: తులా రాశిలోకి బుధుడు
సెప్టెంబర్ 2026లో ధనస్సు రాశి వారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం సక్సెస్ అవుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలమవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉంటున్న పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది.
ధనస్సు రాశి వారికి ఈ నెలలో ఆర్థిక స్థిర త్వం ఏర్పడే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు బాగా ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ .. జీతం పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగావకాశాలు వెతుకుతున్న వారికి మంచి ఆఫర్లు వస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయటా అందరిని ఒక తాటిపైకి తీసుకువస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కీలక వ్యవహారాలలో శత్రువులపై విజయం సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
సెప్టెంబర్ 2026 లో ధనస్సు రాశికి చెందిన వ్యాపారవేత్తలకు అధికంగా లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. గతంలో రావలసిన మొండిబాకీలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆస్తి కొనుగోలు ఆలోచనలు కలసివస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక ఫలిస్తుంది.
కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. సంతానానికి సంబంధించి నూతన విజయాలు చూస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పాత అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. మనశ్శాంతి లభిస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
పరిహారం: మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
