
రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘స:కుటుంబానాం’. తాజాగా మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటూనే ఫ్యామిలీనీ హేట్ చేస్తూ కనిపిస్తాడు రామ్ కిరణ్. కుటుంబాన్ని ప్రేమగా చూసుకునే తను ఎందుకు అసహ్యించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఆసక్తికరంగా చూపించారు.
‘ఎ ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ’ అనే క్యాప్షన్‌తో కట్ చేసిన టీజర్ క్యూరియాసిటీని పెంచింది. మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం ఇతర పాత్రల్లో కనిపించారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.