Sai Dharam Tej: ‘సేవ్ ది టైగర్స్’ డైరెక్టర్తో మెగా హీరో సినిమా.. ఈ మూవీ దర్శకుడు కూడా మంచి నటుడే..

Sai Dharam Tej: ‘సేవ్ ది టైగర్స్’ డైరెక్టర్తో మెగా హీరో సినిమా.. ఈ మూవీ దర్శకుడు కూడా మంచి నటుడే..

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న  సాయి దుర్గ తేజ్ తన నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు. గురువారం సాయి తేజ్ బర్త్‌‌‌‌డే సందర్భంగా  తను హీరోగా నటిస్తున్న  19వ సినిమాను అనౌన్స్ చేశారు.  తేజ కాకుమాను దర్శకత్వంలో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

‘బాహుబలి’, మట్కా సహా పలు చిత్రాల్లో నటుడిగా మెప్పించిన తేజ కాకుమాను, ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌‌‌‌తో  దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ చిత్రంతో  ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.  సాయి దుర్గ తేజ్ కోసం తేజ కాకుమాను ఓ విభిన్నమైన కథను సిద్ధం చేశాడట. కథలోని కొత్తదనం, తన పాత్రలోని వైవిధ్యం నచ్చడంతో సాయి దుర్గ తేజ్ ఈ ప్రాజెక్ట్‌‌‌‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత అనిల్ సుంకర తెలియజేశారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్  వివరాలను  త్వరలో వెల్లడించనున్నారు. మరోవైపు సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రీకరణ ముగింపు దశలో ఉంది.  రోహిత్  కేపీ దర్శకత్వంలో  ప్రైమ్ షో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నిరంజన్ రెడ్డి,  చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.