సంక్రాంతికి  సాయిదుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు

సాయి దుర్గ తేజ్ హీరోగా రోహిత్  కేపీ దర్శకత్వంలో  ప్రైమ్ షో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నిరంజన్ రెడ్డి,  చైతన్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’.  రీసెంట్‌‌‌‌గా షూటింగ్ మొత్తం పూర్తయింది.   ప్రస్తుతం  పోస్ట్- ప్రొడక్షన్  పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని  వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన   పోస్టర్‌‌‌‌లో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ రఫ్ అవతార్‌‌‌‌లో కనిపిస్తున్నాడు.   రక్తంతో, గాయాలతో నిండిన శరీరంతో, మంటల్లో చిక్కుకున్న ప్రదేశంలో, చేతిలో ఆయుధం పట్టుకుని పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉన్న  లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది.  ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌‌‌‌ కాగా,  జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్,  అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.   బి అజనీష్ లోక్‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. భారీ స్థాయిలో డిఫరెంట్ లొకేషన్స్‌‌‌‌లో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెప్పింది.