
సాయి పల్లవి (Sai Pallavi )..ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న సహజ నటి. సాయి పల్లవి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే..అదిరిపోయే స్టెప్పులతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే డ్యాన్సింగ్ క్వీన్. యాక్టింగ్‌లో తనకుంటూ ఓ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకుని..సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా దూసుకెళ్తోంది.
ఇదిలా ఉంచితే..ప్రస్తుతం సాయి పల్లవి ఇంట్లో పెళ్లి సందడి షురూ అయింది. అదేనండీ..రీసెంట్గా సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ (Pooja Kannan) తన బాయ్ ఫ్రెండ్‌తో త్వరలో పెళ్లి అవుతుందని ప్రకటించింది కదా. ఇక త్వరలోనే పెళ్లి కూడా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇంత త్వరగా పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ చేసుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
ఈ నెల జనవరి 21న పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ,లేటెస్ట్గా పూజా కన్నన్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేయడంతో..అసలు విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన పూజా..వినీత్ అనే యువకుడితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. త్వరలో వీరిద్దరి మ్యారేజ్ డేట్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.
పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ ఈవెంట్లో ఇరు కుటంబ సభ్యులు ఉన్నారు. ఈ ఫొటోస్‌లో హీరోయిన్ సాయి పల్లవి చిరునవ్వుతో మెరిసిపోతుంది..ఒక పెద్ద కుటుంబం..నిండు హృదయాల ప్రేమ..ఎప్పటికీ నాలో ఉంటుందని పూజా షేర్ చేసిన ఫొటోకు ట్యాగ్ ఇచ్చింది. మరి ఇప్పుడు సాయి పల్లవి చెల్లెది సడెన్‌గా మ్యారేజ్ అవుతుండటంతో..ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. అదేనండీ..సాయి పల్లవి కూడా త్వరలో మ్యారేజ్ అంటూ షాక్ ఇవ్వదు కదా అని కామెంట్స్ పెడుతున్నారు. అలాగే చెల్లి ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో సాయిపల్లవి తనదైన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. .ప్రస్తుతం సాయి పల్లవి డ్యాన్స్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి
పూజా కన్నన్ తమిళంలో ‘చిత్తిరై సెవ్వనం’ అనే మూవీలో నటించింది. ఆ సినిమాలో సముద్రఖణి కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత పూజాకి మరో సినిమాలో నటించే అవకాశం రాలేదు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సాయి పల్లవికి పర్సనల్ మేనేజర్‌గా ఉంటూ..షూటింగ్‌లు, ప్రమోషన్స్ చూసుకుంటోంది.
Queen SAI PALLAVI Dance in sister engagement function ?♥️✨#SaiPallavi @Sai_Pallavi92 #Poojakannanpic.twitter.com/blMylfn5C5
— Sai Pallavi FC™ (@SaipallaviFC) January 21, 2024