భైరాను చూసేందుకు ప్రపంచం వేచి ఉండలేదు..ఎన్టీఆర్ స్పెషల్ ట్వీట్

భైరాను చూసేందుకు ప్రపంచం వేచి ఉండలేదు..ఎన్టీఆర్ స్పెషల్ ట్వీట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న తెలుగు చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సైఫ్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. శుక్రవారం(ఆగస్ట్ 16న) సైఫ్ అలీఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో తను  భైర పాత్రలో కనిపించనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. 

మల్లయోధుడిలా ఇంటెన్స్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్న సైఫ్.. మల్లయుద్ధానికి దిగి పోటీ చేసిన వారిని మట్టికరిపించే పాత్రలో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించి సినిమాపై క్యూరియాసిటీని పెంచాడు. అతను ఒక లెజెండ్రీ వ్యక్తి అని క్లారిటీ ఇస్తూనే..అతని పాత్ర ఎలా ఉంటుందనేది చూపిస్తూ 53 సెకండ్ల వీడియోని షేర్ చేశారు."పుట్టినరోజు శుభాకాంక్షలు సైఫ్ సార్. తెరపై మ్యాజిక్ సృష్టించే మరో అద్భుతమైన సంవత్సరం ఇక్కడ ఉంది! భైరాను చూసేందుకు ప్రపంచం వేచి ఉండలేదు" అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఇప్పటికే .దేవర నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జాన్వీ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది.నందమూరి  కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  నిర్మిస్తున్నారు.  రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెప్టెంబర్ 27న విడుదల కానుంది.  కొరటాల శివ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత మరో హిట్టు కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.