డబ్బులు వెనక్కిచ్చే ప్రామిస్ చేయను..కొత్త కర్చీఫ్ మాత్రం కొనిస్తా: సైంధవ్ ప్రొడ్యూసర్

డబ్బులు వెనక్కిచ్చే ప్రామిస్ చేయను..కొత్త కర్చీఫ్ మాత్రం కొనిస్తా: సైంధవ్ ప్రొడ్యూసర్

హీరో వెంకటేష్ (Venkatesh) కెరీర్ మైల్ స్టోన్ 75వ మూవీ సైంధవ్ (Saindhav). ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలను చూసుకుంటే..యాక్షన్  స్పార్క్..తండ్రి కూతుళ్ల ఎమోషన్స్ బలంగా ఉన్న చిత్రంగా థియేటర్లోకి రాబోతుంది.  

లేటెస్ట్గా ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి (Venkat Boyanapalli) సినిమా ఎలా ఉండబోతుందో..ఎంతలా ఆకట్టుకోబోతుందో తన మాటల్లో చెప్పేసారు. వెంకీ ఈ సినిమాలో తనదైన నటనతో అన్ని వర్గాల ఆడియాన్స్ ను ఆకట్టుకోబోతున్నాడు.ఈ సినిమా ప్రతి ఒక్కర్ని..ముఖ్యంగా ప్రతి తల్లి తండ్రుల్ని ఎమోషన్స్ తో కట్టి పడేస్తుందని చెప్పారు.

సైంధవ్ చూసాక కన్నీళ్లు ఖచ్చితంగా వస్తాయని, ఒకవేళ అలా జరగకపోతే నాగవంశీ లాగా టికెట్ డబ్బులు వెనక్కు ఇచ్చే ప్రామిస్ చేయను కానీ కొత్త కర్చీఫ్ కొనిస్తానని మాత్రం చెప్పగలను. ఊరికే మాట వరసకు ఏదీ పడితే అది అనలేను. అలా అంటే మీరు ఏదో అనుకోవచ్చు అని సైంధవ్ సినిమాపై ఉన్న విశ్వాసాన్ని తెలిపారు ప్రొడ్యూసర్. 

ఇప్పటికే హీరో వెంకటేష్, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇద్దరూ ఒకే మాట అనడం చూస్తే..బలమైన భావోద్వేగాలు ఉన్నట్టే అని ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయ్యారు. సంక్రాంతి పోటీలో ఉన్న మహేష్ గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, ప్రశాంత్ హనుమాన్ సినిమాలతో పోల్చుకుంటే..ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ సైంధవ్ మూవీకి కనెక్ట్ అవుతున్నారు.

దానికి కారణం లేకపోలేదు.. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ చూస్కుంటే..నరాల సమస్యతో పోరాడే పాప,దాని చుట్టూ అల్లిన సెంటిమెంట్, రీసెంట్ గా రిలీజ్ చేసిన బుజ్జికొండవె పాట ఇవన్నీ ఊహించని రేంజ్లో సినిమాపై ఆశలు పెంచుతోంది. దీంతో సంక్రాంతి సైంధవ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.