సంక్రాంతికి వెంకటేష్ 75వ చిత్రం

సంక్రాంతికి వెంకటేష్ 75వ చిత్రం

వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ను గురువారం అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న సినిమాను విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. 

వెంకటేష్ కెరీర్‌‌‌‌లో ఇది 75వ చిత్రం. నవాజుద్దీన్ సిద్ధిక్, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా,  జయప్రకాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.