ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ఫస్ట్ సాంగ్ వచ్చేది ఇవాళే

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ ఫస్ట్ సాంగ్ వచ్చేది ఇవాళే

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ (Prabhas) ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ సలార్‌ (Salaar). కేజీఎఫ్‌ చిత్రాలతో సంచనలం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) తెరకెక్కించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్, ట్రైలర్ కూడా ఆ అంచనాలకు మించి ఉండటంతో.. రోజురోజుకి సలార్ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటోంది. 

ఇక పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్‌ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా సలార్ నుండి ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్ అందించారు. సూరీడే (Sooreede) అంటూ సాగే ఈపాట ఈరోజు(డిసెంబర్ 13) విడుదల కానుంది. అయితే ఏ టైంకు రానుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇక ఈ సినిమాకు కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్న్ రవి బాసృర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్‌ రెండు పార్ట్స్ కు కూడా ఈయనే సంగీతం అందించారు. దీంతో సాలార్ కు కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ అందిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే సాలార్ ఫస్ట్ సాంగ్ పై భారీగా హైప్ క్రియేట్ అవుతోంది. మరి ఆ హైప్ ను ఈ సాంగ్ రీచ్ అవుతుందా అనేది చూడాలి.  ఇక సాలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, ఈశ్వరీ రావు, బాబీ సింహా, శ్రియారెడ్డి, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.