సలార్ నుండి ఎమోషనల్ సాంగ్.. రిలీజ్ ముందు అదిరిపోయే సర్ప్రైజ్

సలార్ నుండి ఎమోషనల్ సాంగ్.. రిలీజ్ ముందు అదిరిపోయే సర్ప్రైజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న సలార్‌(Salaar) మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా కోసం ఆడియన్స్  ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా.. రాత్రి 1 గంటకె స్పెషల్‌ షోలు పడనున్నాయి. ఇక రిలీజ్ కు ముందు ఆడియన్స్ మరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి.. ప్రతి కథలో.. అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. మరీ ముఖంగా పాటలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. రిలీజ్ కు ముందు ఫుల్ జోష్ ఇచ్చేలా ప్రశాంత్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సాంగ్ కూడా రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. మరి ఆ అంచనాలను సలార్ అందుంటుందో చూడాలి.

ఇక సలార్ సినిమా విషయానికి వస్తే.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్,ఈశ్వరీ రావు కీ రోల్స్ చేస్తున్నారు. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు.