సలార్ రిలీజ్ ట్రైలర్ : ఖాన్సార్.. రక్తంతో ఎరుపెక్కాలి : రెబల్ మాస్ రివ్యూ

సలార్ రిలీజ్ ట్రైలర్ : ఖాన్సార్.. రక్తంతో ఎరుపెక్కాలి : రెబల్ మాస్ రివ్యూ

సలార్.. సలార్.. సలార్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ మూవీ.. మరో మూడు రోజుల్లో మూవీ రిలీజ్ ఉండగా.. చిత్ర యూనిట్ సోమవారం(డిసెంబర్ 18)న ట్రైలర్ రిలీజ్ చేసింది.. ఇంతకీ ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.. 

రెండు రాజ్యాల మధ్య జరిగే యుద్ధం.. ఇద్దరు స్నేహితుల కథ.. యుద్ధ నీతి.. కుట్రలు, కుతంత్రాల మధ్య సాగే కథనం.. పర్షియన్ రాజ్యం నుంచి నేటి ఆధునిక కాలం వరకు కథను టచ్ చేస్తూ.. యుగాలు మారినా.. రాజ్యం కోసం రక్తం పారటం అనేది కామన్. ట్రైలర్ లో ఈ పాయింట్ బాగా హైలెట్ అవుతోంది.

ట్రైలర్ హైలెట్ డైలాగ్స్.. 

>>> పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్.. ఎంత పెద్ద సమస్య వచ్చినా.. తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు.. 
>>> మైకానిక్ కు గన్స్ వాడటం ఎలా తెలుస్తుంది...
>>> సల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చి ఇచ్చేవాడు.. వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు..
>>> ఖాన్సార్ ఎరుపెక్కాలి.. మండే నిప్పుతో అయినా.. వీళ్ల రక్తంతో అయినా.. 

ట్రైలర్ ఓవరాల్ గా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనేది పెద్దగా హైలెట్ కాకుండా.. స్టోరీని చెప్పే ప్రయత్నం జరిగింది. ఎమోషన్స్ బాగా ఉన్నాయి.. ప్రభాస్ యాక్టింగ్ రెబల్ స్టార్ లెవల్లోనే ఉంది.. సింపుల్ గా.. పవర్ ఫుల్ రోల్ గా ఉంది.. కొన్ని కొన్ని చోట్ల.. వర్షం మూవీ.. కేజీఎఫ్ గుర్తుకు రావటం ఆసక్తి రేపుతోంది..