ఉగ్రంలో చెప్పలేనివి సలార్ లో చెప్పాను.. అందుకే ఆ పోలిక

ఉగ్రంలో చెప్పలేనివి సలార్ లో చెప్పాను.. అందుకే ఆ పోలిక

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabahs) నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్(Shruthi Haasan) హీరోయిన్ గా నటిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఈ భారీ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్, ట్రైలర్ వచ్చాక ఆ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పలువాయిదాల తరువాత ఎట్టకేలకు సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. సలార్ మూవీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుండి. ఈ సినిమా కన్నడ బ్లాక్ బస్టర్ ఉగ్రం సినిమాకు రీమేక్ గా వస్తుందనే కామెంట్స్ వినిపించాయి. అవి రూమర్స్ అని, వాటిలో ఎలాంటి నిజం లేదని కూడా మేకర్స్ చాలా సార్లు చెప్పుకొచ్చారు. అయినా కూడా ఆ రూమర్స్ ఆగలేదు. ఇక ఫైనల్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ ఇష్యూపై స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సలార్ రీమేక్ విషయంపై మాట్లాడారు. 

నేను చేసిన ఉగ్రం సినిమాను ఆడియన్స్ మధ్య థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలనుకున్నాను కానీ.. సినిమా నేను అనుకున్నంత హిట్ అవ్వలేదు. ఉగ్రం చాలా స్కోప్ ఉన్న కథ. అందుకే అందులో చెప్పలేకపోయిన పాయింట్స్‌ను సలార్‌ (Salaar) రూపంలో తీసాను. అందుకే సలార్ సినిమాలో ఉగ్రం సినిమా పోలికలు కనిపిస్తాయి.. అంటూ చెప్పుకొచ్చారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.