ఆసక్తిరేపుతున్న సలార్- శౌర్యంగ పర్వం.. రిలీజ్ ఎప్పుడంటే?

ఆసక్తిరేపుతున్న సలార్- శౌర్యంగ పర్వం.. రిలీజ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం ఇండియాలో సలార్(Salaar) ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురుంచే చర్చ నడుస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది. మొదటిరోజు ఏకంగా రూ.178 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. రెండోరోజు కూడా అదే ఊపు కొనసాగనుంది. 
 
రెండు పార్టీలుగా వచ్చిన సలార్ సినిమా మొదటి భాగానికి సీజ్ ఫైర్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇక రెండో పార్ట్ కోసం పార్టీ 1 చివర్లో అదిరిపోయే ట్విస్టు ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక రెండు పార్ట్ కు శౌర్యంగ పర్వం అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు సలార్-శౌర్యంగ పర్వం అనే టైటిల్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 

ఇక పార్ట్ 2 పార్ట్ 1కి మించి ఉంటుందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అందుకే సలార్-శౌర్యంగ పర్వం పై ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే 30% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మరోపక్క ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేసే మూవీకి సంబందించిన షూట్ కూడా 2024లోనే మొదలుకానుంది. దీంతో సలార్ పార్ట్ 2 ముందు విడుదల అవుతుందా.. లేదా ఎన్టీఆర్ సినిమా ముందు రిలీజ్ అవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.