Rajamouli Interview: సలార్ టీమ్తో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ..ఆలస్యం ఎందుకు చూసేయండి

Rajamouli  Interview: సలార్ టీమ్తో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ..ఆలస్యం ఎందుకు చూసేయండి

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ (Salaa) సినిమా కోసం సినీ అభిమానులు వెయిట్ చేస్తోన్న విషయం తెలిసిందే. థియేటర్ల ముందు ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా లేదు. ఇక అంతే కాదండోయ్..సలార్ టీమ్తో దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) చేసిన ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. 

లేటెస్ట్గా రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ (Special Interview)ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ వైట్ షర్ట్లో..డార్లింగ్లా..కూల్గా కనిపిస్తోన్నాడు. రాజమౌళి.. ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌లను ఇంటర్వ్యూ చేయగా..పాన్ వరల్డ్ కాంబో ఒకేచోట ఉందంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

నిన్న సాయంత్రమే రిలీజ్ కావాల్సిన ఈ వీడియో పలు కారణాలతో ఆలస్యం కావడం వల్ల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. ఎట్టకేలకు రిలీజ్ చేసిన ఈ ఇంటర్వ్యూలో సలార్లో ప్రభాస్ నటన శక్తి ఎలా ఉండబోతుంది? షూటింగ్ టైంలో ఎదురైనా ఇన్సిడెంట్స్, సినిమాలో దాగున్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గురుంచి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రివీల్ చేసినట్లు తెలుస్తోంది.  

దర్శకుడు రాజమౌళితో హోంబలే సంస్థకు మంచి  అటాచ్ మెంట్ ఉంది. ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' చాప్టర్-1 తెలుగు ఈవెంట్‌కు జక్కన్న ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యాక సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఇప్పుడు సలార్ టీమ్‌ని స్పెషల్ ఇంటర్వ్యూ చేయడంతో వరల్డ్ వైడ్గా ఈ ఇంటర్వ్యూతో ప్రమోషన్ జోరుందుకున్నట్టే. ఎందుకంటే RRR మూవీతో రాజమౌళి స్థాయి ఆసియా మొత్తంగా పరుచుకుంది.దీంతో ఇంటర్వ్యూ స్పెషల్ బ్లాస్ట్ అని చెప్పుకోవాలి. ఆలస్యం ఎందుకు చూసేయండి.