సల్మాన్ ఖాన్, అలియా జంటగా.. బన్సాలీ మూవీ

సల్మాన్ ఖాన్, అలియా జంటగా.. బన్సాలీ  మూవీ

బాలీవుడ్ దర్శకులు సంజయ్ లీలా బన్సాలీ ‘ఇన్ షా అల్లా’ అనే మూవీని తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాలో హీరోగా.. సల్మాన్ ఖాన్ నటించనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. అయితే హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది సస్పెన్స్ ఉండేది. అయితే.. అది ఈ రోజుతో తీరిపోయింది. సల్మాన్ కు జతగా అలియా భట్ నటించనున్నట్లు చిత్ర యునిట్ తెలిపింది. దీంతో పాటు అలియా కూడా.. బన్సాలీ నెక్ట్ మూవీలో ఎంపికైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపింది. “నేను మొదటిసారి బన్సాలీ సర్ ఆఫీస్ కు వెళ్లినపుడు నాకు తొమ్మిది సంవత్సరాలు ఎప్పటికైనా.. సర్ సినిమాలో నటించాలని అనుకున్నా అది ఇప్పటికి తీరుతున్నందుకు హ్యాపీగా ఉంది అని ” ట్వీట్ చేసింది అలియా.

సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న ‘ఇన్ షా అల్లా’ అనే మూవీని సల్మాన్ ఖాన్, బన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంలో.. సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశాడు. బన్సాలీతో పని చేసి దాదాపు 20 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. ఇప్పటికైనా మళ్లీ తనతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు సల్మాన్. వీరు ‘హమ్ దిల్ దే చుకేహే సనమ్’ చిత్రంలో చివరిసారి పనిచేశారు.