లేడీ రిపోర్టర్కి ముద్దు పెట్టిన సల్మాన్.. వైరల్ అవుతున్న వీడియో

లేడీ రిపోర్టర్కి ముద్దు పెట్టిన సల్మాన్.. వైరల్ అవుతున్న వీడియో

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman khan) ఏం చేసినా అది క్షణాల్లో ట్రెండ్ అవుతుంది. ఆడియన్స్ లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది మరి. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలైపోవడం ఖాయం. వందల కోట్ల కలెక్షన్స్ అలా వచ్చిపడాలంటే. అందుకే గత కొన్నేళ్లుగా స్టార్ హీరోగా టాప్ లో కొనసాగుతున్నారు. 

అయితే సినిమాల్లో చాలా ఎనర్జిటిక్ గా కనిపించే సల్మాన్.. బయట మాత్రం కాస్త గంభీరంగా ఉంటారు. మీడియా మీట్స్ ఉన్నపుడు కూడా తన పరిధి మేరకు మాట్లాడతారు  కానీ.. ఇటీవల జరిగిన గోవా ఫిలిం ఫెస్టివల్ లో మాత్రం చాలా హుషారుగా కనిపించారు. ఎక్కడ అంటే..  గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరయ్యారు సల్మాన్ ఖాన్. ఆ సమయంలో ఆయనతో పాటు తన మేనల్లుడు అలీజా అగ్నిహోత్రి కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి కారు దిగి వస్తున్న సమయంలో.. ఓ బాలీవుడ్ లేడీ సీనియర్ రిపోర్టర్ ని.. ఎలా ఉన్నారు.. అని పలకరిస్తూ తన నుదిటిపై ముద్దు పెట్టాడు సల్మాన్. ఆ రిపోర్టర్ కూడా సల్మాన్ ని సరదాగా పలకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన ఆయన ఫ్యాన్స్ మా హీరో మనసు బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన నటించిన టైగర్ 3 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాష్ రాస్జ్ ఫిలిమ్స్ బ్యానర్ పై స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో కత్రీనా కైఫ్ హీరోయిన్ గా నటించగా.. మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.