నాకు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదు

నాకు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదు

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్‌కు వచ్చిన బెదిరింపులపై ముంబై పోలీసులు సల్మాన్ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ మధ్య కాలంలో తనకు ఏ వ్యక్తితోనూ వివాదాలు లేవని సల్మాన్ తన స్టేట్ మెంట్ లో పెర్కోన్నాడు.  అంతేకాకుండా తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, తనకి ఎలాంటి బెదిరింపు లేఖలు కానీ కాల్స్ కూడా రాలేదని సల్మాన్ తెలిపాడు. వాస్తవానికి రెండు రోజుల క్రితం, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ కి ఒక లేఖ వచ్చింది. ఈ లేఖలో సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరించారు. దీంతో సలీం ఖాన్ ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి సల్మాన్‌కి భద్రతను పెంచారు.