సల్మాన్ చేతిలో సిగరెట్.. నీతులు పక్కవాళ్లకేనా?

సల్మాన్ చేతిలో సిగరెట్.. నీతులు పక్కవాళ్లకేనా?

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్(Salman khan) మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయన బిగ్ బాస్(Bigg boss) స్టేజిపై సిగరెట్ తో కనిపించి అందరినీ ఆశ్ఛర్యపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ సల్మాన్ పై మండిపడుతున్నారు. "మీరు ఉన్నది బాగ్ బాస్ స్టేజిపై. హౌస్ లో కంటేస్టెంట్ లు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పే మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి.. అంటే మనం చెప్పే నీతులు పక్కవాళ్ళకే.. మనకి కాదన్నమాట అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

అయితే ఈ సల్మాన్ సిగరెట్ తో కనిపించిన ఈ ఫోటో ఎప్పటిది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎపిసోడ్ షూట్ జరుగుతున్నప్పటిదా లేక టెలికాస్ట్ అయినా ఎపిసోడ్ దా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై సల్లూ భాయ్ ఎలా రియాక్ట్ అవుతారా అనేది చూడాలి. ఇక సల్మాన్ సినిమా ల విషయానికి వస్తే.. ప్రస్తతం అయన టైగర్3(Tiger3) సినిమాలో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.