మాజీ ప్రేయసిని ముద్దాడిన సల్మాన్.. 57 వ బర్త్ డే పార్టీలో సందడి

మాజీ ప్రేయసిని ముద్దాడిన సల్మాన్.. 57 వ బర్త్ డే పార్టీలో సందడి

సల్మాన్ ఖాన్ 57వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రాండ్ పార్టీకి పలువురు హీరోలు, హీరోయిన్స్ విచ్చేశారు.  దీంతో పార్టీ ఏర్పాటు చేసిన ప్రాంతం సందడిగా మారింది. వచ్చిన వారిని సల్మాన్.. ఆత్మీయంగా పలకరించారు. స్వయంగా బయటకు వచ్చి సెండాఫ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా మాజీ ప్రేయసి ‘సంగీతా బిజ్లాని’తో సల్మాన్ దిగిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ మాజీ ప్రేయసి పట్ల సల్మాన్ చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పార్టీ నుంచి వెళుతున్న క్రమంలో మాట్లాడిన సల్మాన్ ఖాన్..  ఆమె నుదుటిపై ముద్దు కూడా పెట్టాడు.కారు ఎక్కుతుండగా డోర్ తీసి మరీ ఆమెను సాగనంపాడు. 

అయితే... ఇక్కడ ఓ ఘటన చోటు చేసుకుంది. సల్మాన్ వెనుకాలే.. బాడీగార్డ్ షేరా కూడా ఉన్నారు. సంగీత తన కారు వైపు నడుస్తుండగా షేరా ఆమె కోసం కారు డోర్ తెరవడానికి ప్రయత్నించాడు, కానీ సల్మాన్ అకస్మాత్తుగా షేరాను ఆపి ఏదో మాట్లాడాడు. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. 'మాజీ బాయ్‌ఫ్రెండ్ తు హై యా మై' అని ఒకరు కామెంట్ రాశారు, మరొకరు 'సల్మాన్ ఖాన్ నే బోలా హై షేరా సిరఫ్ మేరే లియే కార్ కా గేట్ ఖోల్ నా హై...కిసీ ఔర్ కే నహీ' అని వ్యాఖ్యానించినట్లు రాశారు. మొత్తానికి దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.