సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం

సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కుటుంబంలో విషాదం జరిగింది. ఆయన మేనల్లుడు 38 ఏళ్ల అబ్దుల్లా ఖాన్‌ చనిపోయాడు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్లా సోమవారం రాత్రి ముంబైలోని లీళావతి ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందాడు.

అబ్దుల్లా మృతి పట్ల సల్మాన్‌ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు, బాలీవుడ్‌ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. బాడీబిల్డర్‌ అయిన అబ్దుల్లా… సల్మాన్‌తో కలిసి అనేక వేదికలపై కనిపించారు. వీరిద్దరూ కలిసి జిమ్‌ చేస్తున్న అనేక వీడియోలను సల్మాన్‌ గతంలో అనేకసార్లు సోషల్‌ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు.