శతాబ్ది దాటిన సంఘ్

శతాబ్ది దాటిన సంఘ్

ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ను 1925 విజయదశమి నాడు  నాగపూర్‌‌‌‌లో  డాక్టర్  కేశవ బలిరామ్ హెడ్గేవార్  ప్రారంభించారు. 2025 విజయదశమి నాటికి ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ తన శతాబ్ది (100 ఏళ్లు) ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. కేవలం కొద్దిమంది స్వచ్ఛంద సేవకులతో  మొదలైన ఒక సాధారణ శాఖ, ఒక శతాబ్ద కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా రూపాంతరం చెందింది. ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2025 విజయదశమి నుంచి 2026 విజయదశమి వరకు దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా శతాబ్ది కార్యక్రమాలను నిర్వహించారు.   దేశవ్యాప్తంగా ప్రతిష్టిత, నాగరిక, మేధావుల  సదస్సుల నిర్వహించింది.  దేశవ్యాప్తంగా ఒక లక్షకు పైగా (1,03,019) హిందూ సమ్మేళనాలను ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ నిర్వహించింది. 

దేశభక్తి, నిస్వార్థ సేవ

శతాబ్ది సంవత్సరంలో  సంఘ్ కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా సమాజంలో మార్పు కోసం ఐదు  ప్రధాన అంశాలపై  ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.  అవి 1. సామాజిక సామరస్యత (కులాల సమానత్వం), 2. కుటుంబ ప్రబోధన్ (కుటుంబ విలువలు), 3. పర్యావరణ పరిరక్షణ (జల సంరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం, మొక్కలు నాటడం), 4. ‘స్వదేశీ' జీవనశైలి & ఆత్మనిర్భరత, 5. పౌర విధులు (రాజ్యాంగ నిబంధనలు, పౌర నియమాల పాలన).

ఆర్ఎస్ఎస్ వందేళ్ల కాలంలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, విద్యా రంగాలలో బలమైన ముద్ర వేసింది.  సంఘ్ సాధించిన అతిపెద్ద విజయం క్రమశిక్షణ గల నాయకులను సమాజానికి అందించడం.  రోజువారీ 'శాఖ'ల ద్వారా దేశభక్తి,  నిస్వార్థ సేవ, సమాజ హితాన్ని నూరిపోసి సాధారణ పౌరుల నుంచి అగ్రశ్రేణి నాయకుల వరకు తీర్చిదిద్దింది. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌‌‌‌పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేకమంది నేతలు, సామాజిక కార్యకర్తలు సంఘ్ నేపథ్యం నుంచి ఎదిగినవారే. పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, కుల అసమానతలు లేని సమ సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా సంఘ్ తన శతాబ్ది ప్రస్థానాన్ని ముందుకు నడిపిస్తోంది.

 - సామల కిరణ్ 

Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]

రచయితలు 'వెలుగు' కుమాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.