బాక్సాఫీస్ వద్ద సమంత వసూళ్ల సునామీ.. 'మా ఇంటి బంగారం' కలెక్షన్లపై నయనతార క్రేజీ పోస్ట్!

బాక్సాఫీస్ వద్ద సమంత వసూళ్ల సునామీ.. 'మా ఇంటి బంగారం' కలెక్షన్లపై నయనతార క్రేజీ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మా ఇంటి బంగారం'.  భారీ అంచనాల మధ్య జూన్ 19న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.43 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది. ముఖ్యంగా ఆదివారం నాడు థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడటంతో, ఈ సినిమా రూ.50 కోట్ల మైల్‌స్టోన్‌ మార్కును దాటడానికి చాలా దగ్గరగా వచ్చేసింది.

సమంతకు పెద్ద ప్లస్ అదే..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీ లేకపోవడం ‘మా ఇంటి బంగారం’కి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. వీకెండ్ ముగిసినా సోమవారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్‌లో సాగుతుంది. ఈ జోరు ఇలాగే కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నందిని రెడ్డి మార్క్ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, గౌతమి తదితరులు తమ నటనతో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్‌లోనూ సామ్ మ్యానియా నడుస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ చిత్రం ఇప్పటికే 1.3 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువలో ఉండటం విశేషం.

లేడీ సూపర్‌స్టార్స్ బాండింగ్..

ఇదిలా ఉంటే, ఈ సినిమా సక్సెస్‌పై సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'మా ఇంటి బంగారం' ఫస్ట్ డే కలెక్షన్ల పోస్టర్‌ను నయన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. సామ్.. నీ గురించి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ లవ్, సక్సెస్ అన్నింటికీ నువ్వు వంద శాతం అర్హురాలివి. 'మా ఇంటి బంగారం' టీమ్ మొత్తానికి నా బిగ్ కంగ్రాట్స్అంటూ రెడ్ హార్ట్ ఎమోజీలతో లవ్లీ క్యాప్షన్ ఇచ్చింది.

►ALSO READ | చిరంజీవితో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ.. మోడీ 12 ఏళ్ల పాలనపై మెగాస్టార్ ప్రశంసలు!

నయనతార పెట్టిన పోస్ట్‌కు సమంత కూడా అంతే స్వీట్‌గా రియాక్ట్ అయింది. ఆ స్టోరీని రీపోస్ట్ చేస్తూ.. 'డార్లింగ్ నయన్..' అంటూ హార్ట్ ఎమోజీలతో లవ్ సింబల్‌ను జోడించింది. టాలీవుడ్‌లో ఇద్దరు టాప్ హీరోయిన్ల మధ్య ఉన్న ఈ క్రేజీ బాండింగ్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. కలెక్షన్ల వేటలో దూసుకుపోతున్న ఈ బంగారం, ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.