Samantha: బికినీలో సమంత.. గంటలో 20 లక్షల వ్యూస్

Samantha: బికినీలో సమంత.. గంటలో 20 లక్షల వ్యూస్

సౌత్ బ్యూటీ సమంత(Samantha)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెను ఇష్టపడే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. కొంతకాలం వరకు అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆమె.. ఈమధ్యే కోలుకున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ లో పాల్గొంటారు అనుకుంటున్న ఫ్యాన్స్ కు అంతకుముందే సూపర్ ట్రీట్ ఇచ్చింది సమంత. తన బికినీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ కు షాకిచ్చింది. 

అది చూసిన ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఆమె మలేషియాలో ఉన్నారు. ఆమె అక్కడి అడవుల్లో ఓ నీటి కొలనులో దిగిన ఫొటోలను తన ఇన్స్టాలో షేర్‌ చేసింది. సమంత బికినీలో కనిపించిన ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. కొన్ని గంటల్లోనే 10 మిలియిన్స్‌ ప్రేక్షకులు చూసిన ఈ ఫోటోలకు.. దాదాపు 25 లక్షల వరకు లైక్స్‌ వచ్చాయి. ఇది చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. కేవలం ఒక ఫోటోకి ఈ రేంజ్ క్రేజా. ఏంటి సామ్ ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ సినిమాకు రీమేక్ ఇది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే నెట్ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ తోపాటు మరో రెండు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించనున్నారు సమంత.