విజయ్‌ కి బర్త్ డే విషెస్ చెప్పిన సమంత

 విజయ్‌ కి బర్త్ డే విషెస్ చెప్పిన సమంత

హీరో విజయ్ దేవరకొండ ఇవాళ తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. అయితే విజయ్‌ ని కలిసి బర్త్ డే విషెస్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది హీరోయిన్ సమంత. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సమంతతో కలిసి విజయ్ దేవరకొండ `వీడీ11` వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకుడు. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతుంది. షూటింగ్‌లో భాగంగానే అర్థరాత్రి విజయ్‌ దేవరకొండ బర్త్ డేనిసెలబ్రేట్‌ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో సమంత, దర్శకుడు శివ నిర్వాణ, సినిమా యూనిట్‌ ఉంది. విజయ్‌ చేత కట్‌ చేయించారు. ఆయనకు గుర్తిండిపోయేలా బర్త్ డే విషెస్‌ తెలిపారు. ఇదిలా ఉంటే అంతకు ముందే, ఆదివారం సాయంత్రం విజయ్‌ దేవరకొండ బర్త్ డే సీడీపీని సమంత విడుదల చేయడం విశేషం.

విజయ్‌ దేవరకొండకి సమంత బర్త్ డే విషెస్‌ తెలిపింది. రాబోయే ఈ సంవత్సరం అందరి ప్రేమకి, అనేక ప్రశంసలకు మీరు అర్హులు. మీ వర్క్ ని దగ్గరుండి చూడటం ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపింది సమంత. `వీడీ11` షూటింగ్‌లో రాత్రి విజయ్‌ బర్త్ డే సెలబ్రేషన్‌ టైమ్‌లో ఆయనతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పంచుకుంది సమంత. ఇవి వైరల్‌ అవుతున్నాయి. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ రెండు సినిమాలు చేస్తున్నారు. `లైగర్‌` మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఆగస్ట్ 25న విడుదల కాబోతుంది. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా..  తెలుగులోకి ఆమె ఎంట్రీ ఇస్తుంది. అలాగే పూరీతో మరో సినిమాని ప్రకటించారు విజయ్‌. `జనగణమన` సినిమా చేయబోతున్నట్టు తెలిపాడు.  విజయ్ బర్త్ డే సందర్భంగా పలువురు సినీస్టార్స్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.