ఆ రూమర్స్కు చెక్​ పెట్టిన సమంత..లేటెస్ట్ ఫొటోస్ వైరల్

ఆ రూమర్స్కు చెక్​ పెట్టిన సమంత..లేటెస్ట్ ఫొటోస్ వైరల్

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​సమంత (Samantha) సినిమాల నుంచి కొంత కాలం బ్రేక్​ తీసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆమె మళ్లీ సినిమాలపై ఫోకస్​ పెట్టినట్టు తెలుస్తోంది.

ఇన్స్టాగ్రామ్​లో ఆమె పోస్ట్​ చేసిన ఫొటోలు కొన్ని నెట్టింట వైరల్​గా మారాయి. అందులో సమంత నడుముపై ఉన్న టాటూపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత అతడి పేరుతో ఉన్న టాటూను తొలగించిందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ రూమర్స్​కు సమంత లేటెస్ట్​ ఫొటోస్​ చెక్​ పెట్టాయి.

ఈ జంటను అభిమానించే ఫ్యాన్స్​ మాత్రం వీరిద్దరూ ఎప్పటికైనా కలుస్తారంటూ ఈ పోస్ట్ కు కామెంట్లు చేస్తున్నారు. ఇంత గ్యాప్​ తర్వాత ఈ హీరోయిన్​ నటించబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది. సామ్ వరుస పోస్ట్స్ చూస్తుంటే..ఆరోగ్యం అంత సెట్ అయినట్లు కనిపిస్తోండటంతో సూపర్ సామ్..వెయిటింగ్..అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

సమంత టాటూల విషయానికి వస్తే..

సామ్ మెడ మీద ఉన్న వైఎంసీ (ఏం మాయ చేశావే) అని మీనింగ్ వచ్చేలా షార్ట్ ఫామ్‌లో టాటూ ఒకటి ఉండగా..తన కుడి చేతి మీద మరొక టాటూ ఉంటుంది. నాగ చైతన్య, సమంత చేతుల మీద ఒకేరకమైన..రెండు గీతలతో టాటూస్ కూడా ఉంటాయి. ఆ టాటూని సమంత అలానే ఉంచేసుకుంది. ఇక ఆ రెండు గీతల మీనింగ్ ఏంటనేది..సమంత అప్పట్లోనే బయటకు రివీల్ చేసింది. నీ మార్గాన్ని నువ్వు ఎంచుకో..క్రియేట్ చేసుకో అనే అర్థంలో ఆ రెండు గీతలను వాడుతారట.

ALSO READ :- వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం: భట్టీ

మరొకటి ఎదకి దగ్గరగా సీక్రెట్ ప్లేస్‌లో వేయించుకున్న చై అనే టాటూ. లేటెస్ట్ గా సమంత పోస్ట్ చేసిన పిక్స్ తో మరోసారి టాటూల విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.