ఆ పని చేయండి జ్ఞానమైనా వస్తుంది.. నెటిజన్స్ పై సమంత సీరియస్ కామెంట్స్

ఆ పని చేయండి జ్ఞానమైనా వస్తుంది.. నెటిజన్స్ పై సమంత సీరియస్ కామెంట్స్

సౌత్ స్టార్ బ్యూటీ సమంత(Samantha), అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) ప్రేమించి పెళ్లి చేసుకుని.. కొంతకాలానికే డివోర్స్ తీసుకొని విడిపోయారు. అప్పటి నుండి ఎవరి కెరీర్స్ పై వాళ్ళు దృష్టి పెట్టి వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. కానీ వీరి విడాకుల విషయంపై చర్చలు మాత్రం ఆగడం లేదు.

అయితే తాజాగా మరోసారి  చై-సామ్ విడాకుల విషయం సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. కారణం ఒక కుక్క పిల్ల. అవును.. సమంత-చైతన్య పెళ్లి జరిగిన కొత్తలో ఒక కుక్కపిల్లను పెంచుకున్నారు. దాని పేరు హష్. ఇటీవల నాగచైతన్య ఫ్యాన్ ఒకరు కొత్త బైక్ కొనుగోలు చేశాడు. ఆ బైక్ ను టెస్ట్ డ్రైవ్ చేస్తున్న చైతన్య వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో చై-సామ్ పెంచుకున్న కుక్కపిల్ల హష్ కనిపించింది. దీంతో నెటిజన్స్ ఈ వీడియోపై కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మొన్నటివరకు సామ్ దగ్గరున్న కుక్కపిల్ల ఇప్పుడు చైతన్య దగ్గరకు ఎలా వచ్చింది. వీరిద్దరు ఎప్పుడూ కలిశారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. దీంతో ఈ కామెంట్స్ పై స్పందించారు సమంత.. మీరు ఇంత ఖాళీగా ఉన్నారని అనుకోలేదు.. కనీసం ఏదైనా బుక్ చదువుకోపోయారా? జ్ఞానమైనా వస్తుంది.. అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. దీంతో సమంత చేసిన ఈ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.