సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. కానీ, కొంచెం విభిన్నంగా ఆలోచిస్తే సెలబ్రిటీల దృష్టిని కూడా ఆకర్షించవచ్చని నిరూపించింది ఒక మహిళా టైలర్. గతంలో ఉగాది పండుగ సందర్భంగా యాంకర్ సుమ, హీరోయిన్ సమంత మధ్య జరిగిన ఒక ఫోన్ కాల్ సంభాషణను ఈమె తన ప్రమోషన్ కోసం తెలివిగా వాడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుతోంది.
నెటిజన్లు ఫిదా..
సాధారణంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు తమ మార్కెటింగ్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ మహిళా టైలర్ చేసిన ప్రయత్నం మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉంది. సమంత-సుమల పాత వీడియోను తీసుకుని, అందులో సుమ స్థానంలో తనను తాను ఎడిట్ చేసుకుంది. సమంత అడిగే ప్రశ్నలకు ఈమె సమాధానం చెబుతున్నట్లుగా, ఆ ఎక్స్‌ప్రెషన్స్ పక్కాగా సింక్ అయ్యేలా జాగ్రత్త పడింది. తను కుట్టే బ్లౌజుల డిజైన్లు, టైలరింగ్ నైపుణ్యాన్ని వివరిస్తూ ఆ వీడియోను రూపొందించింది. ఆమె చేసిన ఎడిటింగ్ ఎంత సహజంగా ఉందంటే, చూస్తున్న వారు నిజంగానే సమంత ఆ మహిళతో మాట్లాడుతుందేమో అని భ్రమపడేలా ఉంది.
సమంత రియాక్షన్ !
సాధారణంగా సెలబ్రిటీలు తమపై వచ్చే అన్ని వీడియోలను పట్టించుకోరు. కానీ ఈ మహిళా టైలర్ క్రియేటివిటీ సమంతను సైతం కట్టిపడేసింది. తన ప్రస్తావన ఉన్న ఈ వీడియోను చూసిన సామ్, ఆమె ప్రతిభకు ముగ్ధురాలైంది. వెంటనే ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ ప్రశంసలు కురిపించింది. ఒక స్టార్ హీరోయిన్ తన వీడియోను గుర్తించడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
టాలెంట్‌కు పట్టం..
ఒకప్పుడు పల్లెటూరి ప్రజల ప్రతిభ ఆ నాలుగు గోడలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్ పల్లె ప్రజల టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. కేవలం స్మార్ట్ ఫోన్, కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు.. ఓ రాత్రిలో స్టార్ అయిపోవచ్చని ఈ ఘటన మరోసారి నిరూపించింది. సమంత స్వయంగా మెచ్చుకోవడంతో ఆ మహిళా టైలర్ వీడియో ఇప్పుడు లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. సృజనాత్మకతకు సరిహద్దులు లేవని, ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని ఈ "వైరల్ టైలర్" నిరూపించింది. ఏదేమైనా సమంత చేసిన ఈ చిన్న సాయం ఆ మహిళ వ్యాపారానికి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని నెటిజన్లు సైతం ఆమె క్రియేటివిటీకి ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిప్తున్నారు. .
సమంతను మెప్పించిన రీల్
— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026
సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్‌ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి… pic.twitter.com/xMtp5jsGXs
