Samantha: అలా చూస్తూ ఉండిపోయా.. నాగ చైతన్య హీరోయిన్పై సమంత ప్రశంసలు

Samantha: అలా చూస్తూ ఉండిపోయా.. నాగ చైతన్య హీరోయిన్పై సమంత ప్రశంసలు

హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. షార్ట్ పీరియడ్ లోనే ఇండియాలో ఉన్న హీరోలందరొతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కేవలం సినిమాలతోనే కాదు.. సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు సమంత. ఇక హీరోయిన్ గా పేక్ స్టేజిలో ఉన్నప్పుడే హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు ఈ జంట. అప్పటినుండి ఒంటరిగానే ఉంటున్నారు ఆమె. తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న సమంత నాగ చైతన్య హీరోయిన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె నటన అంటే చాలా ఇష్టం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.  

ఇంతకీ సమంత ప్రశంసించిన ఆ హీరోయిన్ మరెవరో కాదు మలయాళ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi). అవును సమంతకు సాయి పల్లవి డాన్స్ అంటే చాలా ఇష్టమట. తను మంచి డాన్సర్ అన్న విషయం ముందే తెలుసనీ, గతంలో సాయి పల్లవి డాన్సర్ గా పాల్గొన్న షోకు జెడ్జ్ గా వెళ్లానని, ఆ సమయంలో ఆమె డాన్స్ చూస్తూ అలా ఉండిపోయాను.. అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు సమంత. ప్రస్తుతం సమంత సాయి పల్లవిపై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతునాయి.

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా వస్తున్న తండేల్(Thandel) సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తుండగా.. గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.