Samantha: సామ్ ఏజ్ జస్ట్‌ 23..వర్కౌట్లు చూస్తే అంతేమరి!

Samantha: సామ్ ఏజ్ జస్ట్‌ 23..వర్కౌట్లు చూస్తే అంతేమరి!

టాలీవుడ్  స్టార్​ హీరోయిన్​సమంత (Samantha) సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్తో ఎప్పుడు టచ్ లో ఉంటారు. రీసెంట్గా సమంత యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ పాడ్ క్యాస్ట్ చేస్తూ..మరింత లోతైన వివరాలతో హెల్త్కి సంబంధించిన వివరాలను కూడా తెలుపుతుంది. 

లేటెస్ట్గా సమంత వర్కౌట్లు, యోగా చేస్తూ ఇంస్టాగ్రామ్లో పలు ఫొటోస్ షేర్ చేసింది.'ఎప్పటికీ ఉదయపు సూర్యుడినే కోరుకుంటారు' అనే క్యాప్షన్‌ని జోడించింది.పైగా వేకువజాముకి మించిన మంచి సమయం మరోకటి లేదని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది సామ్. ఇక ఈ ఫోటోలు చూస్తుంటే తన ఏజ్36 కాస్తా 23 గా మారిందనే కామెంట్స్ వస్తున్నాయి.

సమంత ఉదయపు సూర్యుడి కోసం వెతుకుతున్నట్లుగా ఆ ఫోజ్‌ ఉందంటూ..ఉదయిస్తున్న సూర్యుడి ఎమోజీలతో పోస్ట్‌లు చేస్తున్నారు నెటిజన్స్.డైరెక్టర్ నందినీ రెడ్డి సమంత పోస్ట్ చేసిన ఫొటోస్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. చమత్కారంగా స్పందిస్తూ..ఇప్పుడే రెండుసార్లు వర్క్‌ఔట్‌లు చేశా! అంటూ సన్‌ గ్లాసెస్‌ ఎమోజీలతో పోస్ట్ చేసింది. అలాగే సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ ఆమె వయసు జస్ట్‌ 23 అన్నట్లు ఉంది అంటూ హార్ట్‌ సింబర్‌ ఎమోజీని పెట్టింది. ప్రస్తుతం సామ్ ఇంస్టాగ్రామ్ ఫొటోస్తో పాటు పలు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

సమంత మోయోసైటిస్‌ కారణంగా కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే.తాను పూర్తిగా కోలుకోవడానికి ట్రీట్ మెంట్తో పాటుగా శరీరాన్ని బలంగా చేసుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంది. అందుకు సమంత జిమ్‌లో వర్కౌట్లు, యోగా,గుర్రపు స్వారీ అంటూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతానికి సమంత మోయోసైటిస్‌ నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది.

ప్రసెంట్ సమంత..డైరెక్టర్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఫిల్మ్ సిటాడెల్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ అమెరికన్ టీవీ సిరీస్కు స్ఫూర్తిగా తెరక్కుతున్నట్లు తెలుస్తుంది.