సిద్దు జొన్నలగడ్డతో సమంత డ్రాప్.. బుట్టబొమ్మకు ఆఫర్!

సిద్దు జొన్నలగడ్డతో సమంత డ్రాప్.. బుట్టబొమ్మకు ఆఫర్!

చిన్న సినిమాలతో తన కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే(Pooja Hegde).. డీజే టిల్లుతో మంచి హిట్ ను అందుకుంది. ఇక అప్పటి నుంచి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది స్టార్‌ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. అలాంటి పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు.

గుంటూరు కారం, ఉస్తాద్‌ భగత్‌సింగ్ సినిమాలతో పాటు రెండు హిందీ సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చినప్పటికి వివిధ కారణాలతో ఆ అవకాశాన్నిఆమె కోల్పోయింది. నానితో కూడా ఓ సినిమా మిస్ అయినట్లు సమాచారం. ఇలాంటి సమయంలోనే పూజా హెగ్డే కి తెలుగు లో ఓ ఆఫర్ తలుపు తట్టిందనే వార్తలు వస్తున్నాయి.

సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సమంత నటించేందుకు ఒప్పుకుంది. ఇప్పుడు దీనికి సమంత సుముఖంగా లేదట. అందుకు ఆఫర్ ను పూజాహెగ్డేకు ఇచ్చారట నందిని రెడ్డి. దీంతో చాలా కాలం తరువాత ఈ బుట్టుబొమ్మకు సినిమా ఆఫర్ వచ్చినట్లయింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)