విడాకులు, అనారోగ్యం విషయంపై.. స్పందించిన సమంత

 విడాకులు, అనారోగ్యం విషయంపై.. స్పందించిన సమంత

అనారోగ్యం ఒక వైపు.. భర్తతో విడాకులు మరోవైపు జీవితం ఒక్కసారిగా తలకిందులైందని నటి సమంత(Samantha) తెలిపింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్​ ఇచ్చిన ఆమె..లేటెస్ట్ గా హార్పర్స్ బజార్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

‘రెండు సంవత్సరాలు నా జీవితంలో ఎదురైన సంఘటనలు నన్నెంతో కుంగదీశాయి. విడాకులు, అనారోగ్యం, విడుదలైన సినిమాలు ఫ్లాప్​ టాక్​ తెచ్చుకోవడంతో చాలా బాధపడ్డాను. అదే టైంలో నాపై ట్రోలింగ్​ జరిగేది. ఇందులో నుంచి బయటపడేందుకు ఎంతో మంది సినిమా స్టార్​ల జీవితాల గురించి చదివాను. వారి నుంచి స్ఫూర్తి పొందాను. 

నటీనటుల జీవితం అంటే అవార్డులతో పాటు ఒడిదుడుకులు కూడా ఉంటాయి. నా వ్యక్తిగత జీవితం గురించి బయటకు తెలిసిందని నేనెప్పుడూ బాధపడలేదు. నాలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ నాలాగే పోరాడే శక్తి ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటాను’ అని సమంత తెలిపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తమ వివాహ బంధానికి..త్వరగానే ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక విడాకులు తర్వాత ఎవరి పనిలో వారు బిజీగా మారారు. అటు సమంత ఫుల్‌ సినిమాలతో బిజీగా ఉంటే..ఇటు నాగచైతన్య (Naga Chaitanya) కూడా తన సినిమాలు తాను చేసుకుంటున్నారు. 

ప్రసెంట్ సమంత.. డైరెక్టర్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఫిల్మ్ సిటాడెల్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ అమెరికన్ టీవీ సిరీస్ కు స్ఫూర్తిగా తెరక్కుతున్నట్లు తెలుస్తుంది.