Samantha Hanuman Review : హనుమంతుడు చేసిన మ్యాజిక్‌ హనుమాన్

Samantha Hanuman Review : హనుమంతుడు చేసిన మ్యాజిక్‌ హనుమాన్

హనుమాన్ (Hanuman) సినిమా దెబ్బకు పాత రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న లెక్కలతో కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Verma) తెరకెక్కించిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. హనుమాన్ ను చూసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. 

లేటెస్ట్గా హీరోయిన్ సమంత (Samantha) తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో హనుమాన్ రివ్యూను పోస్ట్‌ చేసింది. 'మనల్ని మళ్ళీ  బాల్యంలోకి తీసుకెళ్లేలా తెరకెక్కించే సినిమాలు ఎంతో ఉత్తమమైనవి. ‘హనుమాన్‌’ మూవీలో ప్రతి అంశం నన్ను ఎంతోగాను ఆకట్టుకుంది. వెండితెరపై హనుమంతుని విశ్వరూపం చూసినట్లుగా ఉంది. విజువల్స్, కామెడీ, మ్యూజిక్..ఇలా ఎన్నో అద్భుతమైన అంశాలతో వెండితెరపై హనుమంతుడు చేసిన మ్యాజిక్‌ ఈ హనుమాన్ మూవీ. ఇంత గొప్ప సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మకు ధన్యవాదాలు.

ఈ మూవీ  సీక్వెల్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. తేజ సజ్జా తన అరుదైన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడు. అమాయకుడైన హనుమంతు పాత్ర ఈ సినిమాకు హార్ట్‌. వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌లు సినిమాకు మరింత అందాన్నిచ్చాయి..ఇంతటి గొప్ప చిత్రంలో భాగమైన మేకర్స్ అందరికీ అభినందనలు అంటూ సమంత తెలిపారు. ప్రస్తుతం సమంత ఇచ్చిన హనుమాన్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ మూవీ భారీ వసూళ్లు సొంతం చేసుకుంటోంది. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి..థియేటర్లలో సక్సెస్ ఫుల్గా దూసుకెళ్తోంది.