టాలీవుద్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం తన జీవితంలోనే అత్యంత మధురమైన క్షణాలను ఆస్వాదిస్తోంది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును గత ఏడాది డిసెంబర్ 1, 2025న వివాహం చేసుకుంది. ఇటీవల రిలీజ్ అయిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ ను సొంతం చేసుకుని ఫుల్ జోష్ లో ఉంది. త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందబోతుంది . లేటెస్ట్ గా సమంత తన బేబీబంప్ ను చూపిస్తూ పిక్స్ నెు సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఇది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సీ యు లేటర్ సిక్స్ ప్యాక్..
లేటెస్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బ్లాక్ కలర్ ఫిట్టెడ్ అవుట్‌ఫిట్‌లో ఉన్న ఒక క్యాజువల్ ఫోటోను సమంత షేర్ చేసింది. అందులో తన ముద్దుల బేబీ బంప్‌ను చూపిస్తూ.. 'మై సిక్స్ ప్యాక్.. ఐ విల్ సీ యు వెన్ ఐ సీ యు' అంటూ ఒక ఫన్నీ ఎమోజీతో క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. అప్పట్లో తన ఫిట్‌నెస్‌తో, అబ్స్‌తో మెస్మరైజ్ చేసిన సామ్, ఇప్పుడు ఆ సిక్స్ ప్యాక్‌కి బైబై చెప్తూ మాతృత్వాన్ని చిరునవ్వుతో ఆహ్వానిస్తున్న తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో డెలివరీ ఉండబోతుందని సమాచారం.
మెటర్నిటీ లీవ్
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తన లేటెస్ట్ హిట్ చిత్రం 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో సమంత అఫీషియల్‌గా తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో గుల్షన్ దేవయ్య, దిగంత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.80 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ జోష్‌లోనే సామ్ మాట్లాడుతూ.. ఈ సినిమా తర్వాత నా కండిషన్ వల్ల చిన్న గ్యాప్ తీసుకోక తప్పదు. మెటర్నిటీ లీవ్ తర్వాత మళ్లీ సరికొత్త సినిమాతో మీ ముందుకు వస్తా అని ఫ్యాన్స్‌కి ప్రామిస్ చేసింది.
గత చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ, సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సమంత.. ఇప్పుడు ప్రెగ్నెన్సీ గ్లోతో మరింత అందంగా కనిపిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ కాబోయే అమ్మకు సోషల్ మీడియా వేదికగా హార్ట్ ఎమోజీలతో కంగ్రాట్స్ చెప్తున్నారు.
